కరోనావైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆరోగ్యం మళ్లీ మామూలుగా అవుతుందా?

అది సాధ్యమే. ఈ వైరస్ వ్యాపించిన చాలా మందికి తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి.


వాటిలో, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి.


ఎక్కువమంది ఈ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడిన తర్వాత పూర్తిగా మామూలుగా అవుతారు.


కానీ వృద్ధులు, మొదటి నుంచీ మధుమేహం, క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉన్నవారికి ఈ వైరస్ చాలా ప్రమాదకరం.


దానితోపాటు రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి కూడా ఇది చాలా హానికరం అని చెబుతున్నారు.